అవన్నీ రూమర్లే… నమ్మొద్దు…

Does Simbu want to marry Oviya

శింబు.. మంచి రసికుడు అన్న విషయం మనకు తెలిసిందే… ఒకరితో కాదు ఇద్దరు ప్రముఖ హీరోయిన్లతో ప్రేమకథలను నెరిపిన నేపథ్యం ఉన్నవాడు. మొదట్లో నయనతారను, ఆ తర్వాత హన్సికను ప్రేమలో దించేసి వారిని ఆస్వాధించాడు శింబు. అయితే వాళ్లిద్దరినీ పెళ్లి చేసుకోలేదు. నయనతారను శింబునే వదిలించుకుంటే, హన్సిక మాత్రం తనే శింబుని వదిలించుకుందని అంటారు. శింబూ కూడా హన్సిక తనను వదిలేసిపోయిందని ఒకసారి వాపోయాడు. అయితే ఇప్పుడు శింబుపై కొత్త రూమర్ పుట్టింది.

బిగ్‌బాస్ హౌస్ తో బాగా పాపులర్ అయిన ఓవియా ను శింబు పెళ్లి చేసుకుంటానని అన్నాడని ఈ మధ్య బాగా ప్రచారం సాగుతోంది. ఓవియాకు శింబు పడిపోయినట్టుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శింబు రియాక్ట్ అయ్యాడు.ఓవియా తనను బాగా ఆకట్టుకున్నట్టుగా, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తను వ్యాఖ్యానించినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని శింబు స్పష్టం చేశాడు. టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో అసత్యప్రచారం జరుగుతోందని శింబు పేర్కొన్నాడు.

ఓవియా తనకు బాగా నచ్చినట్టుగా, ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని శింబు అన్నట్టుగా ట్విటర్ లో ఒక పోస్టు ప్రచురితం అయ్యింది. అయితే ఆ ట్విటర్ అకౌంట్ తనది కాదని శింబు స్పష్టం చేశాడు. ఫేక్ అకౌంట్ నుంచి ఆ ట్వీట్ పోస్టు అయిన విషయాన్ని గ్రహించకుండా తనపై అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని శింబు ధ్వజమెత్తాడు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసే ముందు కొంచెం ఆలోచించండి.. అని శింబు మీడియాకు హితబోధ చేశాడు.