నెట్టింట్లో ధోనీ-జీవాల మరో వీడియో..

MS Dhoni Plays With Daughter Ziva

రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి గెలుపు ఓటమిలతో ప్లే ఆఫ్‌కు చేరింది చెన్నై. ఇక ప్రతి చెన్నై మ్యాచ్‌లో ధోనీ గరాల పట్టి జీవా సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన తండ్రి ధోని గ్రౌండ్‌లో ఉన్నప్పుడు గంతులేయడం, గతంలో షారక్‌ ఖాన్‌తో ఫోటోలు దిగడం వంటి వీడియాలు వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోతో మరోసారి నెట్టింట్లోకి వచ్చింది ధోనీ-జీవాల వీడియో.

MS Dhoni Plays With Daughter Ziva

ఐపీఎల్‌లో భాగంగా నిన్న(ఆదివారం) చెన్నై సూపర్‌ కింగ్స్-కింగ్స్‌ ఎలెవన్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో జీవా తన తండ్రి ధోని టోపీని తీస్తూ పెడుతూ ఇద్దరు ఆడుకుంటూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక నిన్నజరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఫ్లే ఆఫ్‌కు చేరుకుంది చెన్నై. గతంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో కసితో ఈ మ్యాచ్‌లో మరోసారి విజయం సాధించి చెన్నై పవర్‌ను మరోసారి చూపించింది. ఈ మ్యాచ్‌లో ఎంగ్డీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.