వశిష్టి దేవి.. శ్రేయ

shreya sarann
shreya sarann

2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ పుట్టిన రోజు నేడు. నటిగానే కాకుండా ఉంటే డాన్సర్ గా కూడా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకుంది శ్రేయ.  సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే సినిమాల ఘన విజయాలు ఆమె కెరీర్ కు పూలబాట వేశాయి. రజనీకాంత్ తో చేసిన శివాజీ మంచి పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలే కాక పవిత్ర వంటి నటనకు స్కోప్ ఉన్న కేరక్టర్లూ వేసింది శ్రేయ. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో…మనం… సినిమా శ్రేయకు సక్సెస్ ఇచ్చింది. ఆ సినిమాలో నాగార్జునతో గ్రామీణ యువతిగా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాక, ఇంగ్లీష్, కన్నడ చిత్రాల్లో కూడా శ్రేయ నటించింది. అజయ్ దేవగన్ తో దృశ్యంలోనూ, నాగార్జునతో ఊపిరిలోనూ మంచి కేరక్టర్స్ చేసింది. నటనకు ప్రాధాన్యమున్న కేరక్టర్స్ ను శ్రేయనే చేయాలి అని పేరు తెచ్చుకుంది. తాజాగా శ్రేయ ఇప్పుడు బాలకృష్ణ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిలో వశిష్టి దేవి పాత్ర పోషిస్తోంది. ఇది ఓ కీలకమైన కేరక్టర్.

shreya-gouthami

ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రియ క్లోజప్తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో రాణి లుక్లో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోటలో జరుగుతోంది. అక్కడ బాలయ్య బాబు, శ్రేయ, హేమామాలినికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్లో దర్శనమిస్తున్నాయి. బాలకృష్ణ నడుచుకుంటూ వస్తున్న ఫొటోతోపాటు, పసిబిడ్డను ఎత్తుకొని వస్తున్న శ్రేయ ఫొటో కూడా ఆన్‌లైన్లో హాల్‌చల్ చేస్తోంది. ఫొటోలను బట్టి చూస్తే రాజమాతగా హేమామాలిని నటిస్తోందని తెలుస్తోంది. క్రిష్ ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.

shriya-and-hema-malini-look-in-gautamiputra-satakarni

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.