అప్పుడే కోటి మంది చూశారు !

10 million views for SPYDER Telugu Teaser
10 million views for SPYDER Telugu Teaser

మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పైడ‌ర్ . సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని మహేష్‌ బర్త్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ టీజ‌ర్ అప్పుడే 10 మిలియ‌న్ల (కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. మ‌హేశ్‌బాబు స్టైల్, డైలాగ్‌ల‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

భయపెట్టడం మాకు తెలుసు..ఆ రోజు అంతమంది మధ్య దాక్కున్నావే అదే భయమంటే అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోండగా బ్లైండ్ డేట్ కావాలి అంటూ రకుల్ డైలాగ్‌ కూడా కట్టిపడేసింది. కొత్త క‌థాంశంతో, మంచి సందేశాన్నిచ్చే విధంగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు చేస్తోన్న ప‌నుల్ని క‌నిపెట్టే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది.