You are here

అమర్ నాథ్ యాత్రలో విషాదం.. 11 మంది మృతి

అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాంబాణ్‌ జిల్లాలోని జాతీయరహదారిపై 46 మంది భక్తులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 11 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, కొద్ది రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లో అనంత్‌నాగ్‌ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. హైవే పైకి అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు రావడంతో యాత్రికులకు తుటాలు తగిలాయి.

Related Articles