2018…. పండుగ తేదీలివే

2018 Hindu Festivals Calendar

వచ్చే ఏడాది(2018) పండగ తేదీలపై రాష్ట్రంలోని సిద్దాంతులు,జ్యోతిష్యులు, పంచాంగకర్తలు స్పష్టతనిచ్చారు. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన విద్వత్‌ సభ నిర్ణయా లను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వా నంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మ తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తెలిపారు. ఈ తేదీలనే అధికారికంగా గుర్తించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. పండుగ తేదీల వివరాలిలా ఉన్నాయి.

2018 మార్చి 18: ఉగాది
మార్చి 25: స్మార్తానాం శ్రీరామనవమి
మార్చి 26: వైష్ణవానాం శ్రీరామనవమి
ఏప్రిల్‌ 14: మాస శివరాత్రి
ఏప్రిల్‌ 18: అక్షయ తృతీయ
మే 10: శ్రీ హనుమాన్‌ జయంతి
జులై 27: వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ
జులై 29: సికింద్రాబాద్‌ మహంకాళి జాతర
ఆగస్టు 24: వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 26: రాఖీ పూర్ణిమ
సెప్టెంబర్‌ 2: స్మార్తానాం శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 3: శ్రీ వైష్ణవానాం శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 13: వినాయక చవితి
అక్టోబర్‌ 17: దుర్గాష్టమి
అక్టోబర్‌ 18: విజయదశమి
నవంబర్‌ 6: దీపావళి
నవంబర్‌ 23: కార్తీక పూర్ణమి