రకుల్ బాటలో నిఖిల్..!

Hero Nikhil launches F45 Fitness Centre at Begumpet

హ్యాపీడేస్’లో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా కనిపించిన నిఖిల్, ఆ తరువాత తనని తాను మలచుకున్న విధానం ఆశ్చర్యం కలిగించకమానదు. శరీరాకృతి విషయంలోను .. బాడీ లాంగ్వేజ్ విషయంలోను .. నటన విషయంలోను ఆయన తనకంటూ ఒక స్టైల్ ను ఏర్పరచుకున్నాడు. సక్సెస్ లతో పాటు యూత్ లో తనకంటూ క్రేజ్ ను తెచ్చుకున్నాడు.  టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ లు కొన్ని సినిమాలు చేశాక వ్యాపార రంగంలోకి దిగటం చాలా సహజమైపోయింది. అలా సినిమాల్లో నటిస్తూనే విజయవంతంగా వ్యాపారంలో దూసుకుపోతున్నారు నటీనటులు. చేస్తున్న వ్యాపారంతో సంబంధం లేకుండా వారి వారి అభిరుచికి తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్లే చాలా ఫాస్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ బ్రాండ్ ఎఫ్ 45 తో కలిసి హైదరాబాద్ లో పలుచోట్ల జిమ్ సెంటర్లను ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే బిజినెస్ తో యంగ్ హీరో నిఖిల్ అసోసియేట్ అయ్యాడు.  ఈ నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్ లో నిఖిల్ ఎఫ్ 45 నూతన బ్రాంచ్ ను ఓపెన్ చేశాడు. దీంతో పాటే త్వరలోనే 6 నూతన జిమ్ సెంటర్లు ఏర్పాటు చేసే పనిలో నిఖిల్ ఉన్నాడని తెలిసింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే బిజినెస్ లో కూడా సక్సెస్ కొట్టాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మొన్నటివరకు ఎఫ్ 45 జిమ్ అంటే రకుల్ ప్రీత్ సింగ్ దే కదా అని సమాధానం ఇచ్చే సీని జనాలు ఇక నుంచి ఎఫ్ 45 జిమ్ అంటే నిఖిల్ ది అంటారేమో చూడాలి.