ప్రియురాలితో గొడ‌వ‌ప‌డ్డ కోహ్లి అరెస్ట్…

arman kohli

అందేంటి కోహ్లికి మొన్నే క‌దా పెళ్లి అయింది మ‌ళ్లి ప్రియురాలు ఎంటి అనుకుంటున్నారా…మ‌నం చెప్పుకునేది క్రికెట‌ర్ కోహ్లి కాదులేండి. బాలీవుడ్ న‌టుడు అర్మాన్ కోహ్లి. గ‌త కొద్ది రోజులుగా అర్మాన్ కోహ్లి త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ను వ‌దిలేసి దూరంగా ఉంటున్నాడు. దింతో ఇన్ని రోజులు నాతో డేటింగ్ చేసి ఇప్పుడు త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని త‌న‌ను శారీర‌కంగా వేధించాడ‌ని ముంబైలోని శాంటాక్రూజ్ పోలీస్ స్టేష‌న్ లో ఆర్మాన్ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టైలిస్ట్ నీరూ. దిందో పోలీసులు కోహ్లిపై 302,326,504,506 సెక్ష‌న్స్ కింద కేసు న‌మోదు చేశారు.

armaan kohli, neeru

మూడు సంవ‌త్స‌రాల కింద సన్నిహిత వ్య‌క్తి ద్వారా వీరిద్ద‌రూ ఏకం అయ్యారు. గ‌త కొద్ది రోజుల నుండి వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారు. కాని ఈ మ‌ధ్య కాలంలో ఆర్ధిక సంబంధ‌మైన విషయాల వ‌ల్ల గొడ‌వ‌లు రావ‌డంతో వీరి ప్రేమ విష‌యం పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది. జూన్ 3న అర్మాన్ కోహ్లి త‌న ప్రేయ‌సితో గొడ‌వప‌డిన విష‌యం తెలిసిందే. దింతో గొడ‌వ ఎక్కువ కావ‌డంతో కోహ్లి నీరూని బ‌లంగా నెట్టేయ‌డంతో మెట్ల‌పై నుంచి కింద ప‌డ‌టంతో త‌ల‌కు బాగా గాయ‌మైంది. దింతో గాయ‌ప‌డ్డ నీరూ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కోహ్లిపై ఫిర్యాదు చేసింది.

armaan kohli, neeru

కోహ్లి గ‌ర్ల్ ఫ్రెండ్ చేసిన ఫిర్యాదు మేర‌కు అత‌నిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. గ‌త కొద్ది రోజులుగా ప‌రారీలో ఉన్నాడు అర్మాన్ కోహ్లి. ఇక తాజాగా అర్మాన్ కోహ్లిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. అర్మాన్ కోహ్లి ఇటివ‌లే స‌ల్మాన్ హోస్ట్ గా చేసిన‌టువంటి బిగ్ బాస్ టీవీ రియాల్టీ షో ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. అర్మాన్ కోహ్లి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్ర‌తిఒక్క‌రికి తెలుస‌న్నారు అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ స్టైలిష్ నీరూ. కోహ్లి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌న్ని కోర్టుకు త‌ర‌లించ‌నున్నారు.