భారీగా పెంచేసిన సమంత‌…

actor samantha acting in next movie demand high remunaration

టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ లీస్ట్ లో ఒక‌రు స‌మంత‌. ఆమె న‌టించిన సినిమాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హీట్ల‌ను సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇటివ‌లే స‌మంత న‌టించిన మూడు సినిమాలు భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. మార్చి చివ‌ర‌లో విడుద‌లైన రంగ‌స్ధ‌లం సినిమా సూప‌ర్ కావ‌డంతో ఆ త‌రువాత వ‌చ్చిన మ‌హ‌న‌టి సినిమా కూడా భారీ విజ‌యాన్ని అందుకుంది. త‌మిళ్ లో న‌టించిన‌ ‘ఇరుంబు తిరై సినిమా కూడా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇక పెళ్లైన త‌ర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంద‌నుకున్న స‌మంత‌..పెళ్లి త‌ర్వాత ఇంకా ఎక్కువ సినిమాలు చేయ‌డంతో పాటు అవి మంచి హీట్లు అందుకుంటున్నాయి. స‌మంత న‌టించిన సినిమాలు ఘ‌న విజ‌యం సాధిస్తుండ‌టంతో పారితోష‌కం కూడా పెంచనుంద‌ని స‌మాచారం .

actor samantha acting in next movie demand high remunaration

పెద్ద హీరోల‌తోనే కాకుండా చిన్న హీరోల‌తో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. పెళ్లయ్యాకు సినిమాలు వేగ‌వంతం చేసింద‌ని చెప్పుకొవాలి. తాజాగా సౌత్ లో విడుద‌ల‌యిన మూడు సినిమాలు హిట్ అవ్వ‌డంతో పారితోష‌కాన్ని పెంచేసింద‌ని టాక్. స‌మంత గ‌తేడాది తెల‌గులో ఒక సినిమా, త‌మిళ్ లో ఒక సినిమా మాత్ర‌మే న‌టించింది. అయితే త‌మిళ్ లో న‌టించిన మెర్స‌ల్ సినిమా ఘ‌న విజయం సాధించ‌గా.. తెలుగులో న‌టించిన రాజుగారి గ‌ది2 సినిమా మాత్రం కొంచెం నిరాశ‌ప‌రిచింది. ఈరెండు సినిమాల కోసం స‌మంత త‌న పారితోష‌కాన్ని త‌గ్గించుకుంది. ఈఏడాది వ‌రుస‌గా విజ‌యాలు వ‌స్తుండ‌టంతో పారితోష‌కాన్ని కూడా అదే రేంజ్ లో పెంచ‌నుంద‌ని స‌మాచారం. ఇక నుంచి స‌మంత చేయ‌బోయే సినిమాలకు పారితోష‌కం ఎంత మేర‌కు పెంచ‌నుందో చూడాలి.