అనిత తండ్రికి ధైర్యం చెప్పిన హీరో విజయ్‌..

Actor Vijay visits Anitha's parents

ఇటీవల నీట్‌లో సీటు రాకపోవడంతో ఇక డాక్టర్‌ను అవలేననే బాధతో అనిత అనే విద్యార్థిని సుసైడ్ చేసుకున్న విషయం విధితమే. ఈ విద్యార్థిని ఆత్మహత్యతో కోలీవుడ్ ఏకమైంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటనపై ఇప్పటికే విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్‌ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 Actor Vijay visits Anitha's parents

అయితే ఈ ఘటనపై తాజాగా ప్రముఖ నటుడు విజయ్ ఏకంగా అనిత ఇంటికెళ్లి ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె తండ్రిని దగ్గరకు తీసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు విజయ్. అంతేకాకుండా ఓ సామాన్యుడిలా అనిత కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఇటీవలే తమిళ హీరో సూర్య కూడా స్పందించారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఓ మంచి డాక్టర్‌ను తమిళనాడు కోల్పోయిందంటూ ట్వీట్ చేశారు. వీరే కాకుండా సెలబ్రిటీలు చాలా మంది అనిత ఆత్మహత్యపై స్పందించారు.