ప్రేమ తప్ప భయం లేదు..

త్వరలోనే నాగ చైతన్య -సమంతలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న సంగతి తెలిసిందే, ఎప్పుడెప్పుడా అని ఆ శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు . . ప్రస్తుతం తెలుగులో రంగస్థలం 1985, మహా నటి, రాజుగారి గది 2 చిత్రాలు చేస్తున్న సామ్ తమిళంలోను కొన్ని సినిమాలు చేస్తుంది. ఒక వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది.

Actress Samantha Speech Herself

తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ..‘‘ఒక కొత్త పాత్రని చేయాలన్నప్పుడు మొదట్లో ఓ రకమైన భయం వ్యక్తమయ్యేది. కానీ అనుభవం పెరిగేకొద్దీ భయం స్థానంలో ప్రేమ చేరింది. ఏ పాత్రనైనా ప్రేమించి చేయడం అలవాటుగా చేసుకొన్నా’’ అంటోంది సమంత. దక్షిణాదిన కొనసాగుతున్న అగ్ర కథానాయికల్లో ఆమె ఒకరు. సవాళ్లంటే ఎంతో ఇష్టమని చెబుతోంది. ‘‘తొలినాళ్లల్లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేదాన్ని. దాంతో నన్ను తెరపై చూసి సమంత ఇలాంటి పాత్రలే చేయగలదని మాట్లాడుకొన్నారు. ఆ మాటలు నేరుగా నా చెవినపడ్డాయి.

నటి అన్నాక అన్నీ చేసి చూపించాల్సిందే కదా. అందుకే నాలో పౌరుషం పెరిగింది. వాణిజ్య చిత్రాలకి తగ్గ కథానాయికని కూడా అనిపించుకోవాలనుకొన్నా. ఒకట్రెండు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేసి చూపించా కూడా. ఇప్పుడు ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధం. ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణమే ఆ ఆత్మవిశ్వాసాన్నిచ్చింద’’ని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’లో నటిస్తోంది. త్వరలోనే ‘రాజుగారి గది2’తో సందడి చేయబోతోంది.