‘గూఢచారి’ ఫస్ట్ లుక్..

Adivi Sesh Goodachari First Look Poster Released

నటుడు, రచయిత అడివి శేష్ కొత్త చిత్రం ‘గూఢచారి’ ఫస్ట్ లుక్ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు విడుదలైనది. క్షణం, ‘అమీ తుమీ’ వంటి విభిన్న చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్ ఈ సారి స్పై థ్రిల్లర్‌తో మనముందుకు రానుండటం విశేషం. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. తుపాకులు, బులెట్ లతో అధునాతనంగా డిజైన్ చేయబడిన ‘గూఢచారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Adivi Sesh Goodachari First Look Poster Released

ఓ మంచి కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ గూఢచారిగా కనిపిస్తారు. అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీం మిర్చంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక వర్గం: దర్శకత్వం: శశికిరణ్ తిక్క,కథ: అడివి శేష్,నిర్మాతలు: అభిషేక్ నమ, టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్,సహా నిర్మాత: వివేక్ కూచిబొట్ల,సంగీతం: శ్రీచరణ్ పాకాల,మాటలు: అబ్బూరి రవి,ఛాయాగ్రాహకుడు: ష్యానియల్ డియో,ఎడిటర్: గ్యారీ బి.హెచ్,ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు.