యంగ్ హీరోతో ఐశ్వర్యరాయ్ రొమాన్స్

aishwarya rai romance with young hero

ఐశ్వర్యరాయ్…..ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్క కుర్రకారు ముఖంలో ఆనందం చిగురిస్తుంది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ల్ సైతం ఆమెను తాకడానికి ఆసక్తి చూపారంటే అతిశయోశక్తే లేదు. అలాంటి అందాలరాశి ఐశ్వర్యరాయ్‌తో కలిసి పనిచేయాలని కోరుకోని దర్శకుడు ఉండరు.

అయితే ఇప్పుడు ఈ ప్రపంచ సుందరి 40 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలతో రొమాన్స్ చేయడం ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ మధ్యనే ‘ ఏ దిల్ హై ముష్కిల్ ‘ మూవీలో యంగ్ హీరో రణ్బీర్ కపూర్ తో చేసిన ఘాటు రొమాన్స్ మర్చిపోకముందే మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. ” రంగ్ దే బసంతీ’..’ భాగ్ మిల్కా భాగ్ ‘ లాంటి హిట్స్ ఇచ్చిన రాకేష్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో ‘ ఫ్యానీ ఖాన్ ‘ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో ఐశ్వర్య లీడ్ రోల్ చేయనుంది.

ఈ మూవీలో ఐశ్వర్యకి జోడీగా వివేక్ ఓబెరాయ్ తమ్ముడు అక్షయ్ ఓబెరాయ్ ని హీరోగా తీసుకోవాలనుకున్నాడట డైరెక్టర్. అయితే అప్పట్లో వివేక్ ఓబెరాయ్ తో ఐశ్వర్య ఎఫైర్.. దాని వల్ల సల్మాన్ తో గొడవ.. తెలిసిందే. అందుకే ఐశ్వర్యతో నటించడానికి నో చెప్పేసాడట అక్షయ్ ఓబెరాయ్. దాంతో ఐశ్వర్యకి జోడీగా మరో యంగ్ హీరో కోసం చూస్తున్నాడట డైరెక్టర్.