అక్కా చెల్లెళ్లా … అత్తా కోడళ్లా …

Aishwarya Rai With niece Navya Naveli

వరల్డ్ బ్యూటీగా పేరుగాంచిన  ఐశ్వర్య రాయ్ పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఆమె వయసులో, అందంలో  ఏ మాత్రం తేడా రాలేదనే చెప్పాలి. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అందరిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఐశ్వర్య ఏ కార్యక్రమాలకు వెళ్లినా అందంగా కనిపిస్తుండడంతో కెమెరాలన్నీ ఆమె వైపే తిరుగుతున్నాయి. ఇటీవల వోగ్ బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్ ముంబాయిలో జరిగింది. అభిషేక్ తప్ప , అమితాబ్ బచ్చన్ కుటుంబం మెుత్తం హాజరు అయ్యారు.

కానీ ఈవెంట్ లో కుటుంబం మెుత్తంలో ఐశ్వర్యరాయ్, అమితాబ్ పెద్ద మనవరాలు నవ్య నవేలీ నంద అట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలాగే ఐశ్వర్య తన డ్రెసు, అలంకరణతో వీక్షకులను కట్టిపడేసింది. అయితే ఈసారి నవ్య కూడా తన అత్తకు ఏ మాత్రం తగ్గకుండా స్కైబ్లూ గౌనులో మెరిసింది. నవ్య బయట జరిగే కార్యక్రమాలకు హాజరుకాదు. కాని తన కుంటుంబం మెుత్తం వెళ్తూంది కావున నవ్య కూడా కుంటుంబంతో కలసి ఈవెంట్లో మెరిసిందట.

అయితే నవ్య తన మేనత్త ఐశ్వర్య పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో  పాల్గొన్న నవ్య – ఐశ్వర్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్  చల్ చేస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు అందంతో మెరిసిపోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. ఎందుకంటే వారు వేసుకొచ్చిన డ్రెస్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.