అఖిల్‌.. హాలో తాజా అప్ డేట్‌

Akhil Hello Update

హలో అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అక్కినేని అఖిల్. .” మనం ” ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ యువ హీరో నటిస్తున్న ” హలో ” సినిమా   అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. అఖిల్ మూవీ ఫ్లాప్‌ కావడంతో  రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ మళ్ళీ నటిస్తున్న చిత్రమిది.

గురువారంతో  షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తికాగా చిత్రప్రమోషన్‌ కార్యక్రమాల్లో యూనిట్ బిజీగా ఉంది. కాగా ఈమూవీ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న విశాఖపట్నంలో హలో ఆడియో ఈవెంట్ జరగనుంది.

akhil hello

హలో ప్రమోషన్స్‌ను భుజాన వేసుకున్న నాగ్…సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు.  గతంలో విక్రమ్ కుమార్ .. అనూప్ రూబెన్స్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ .. ‘మనం’ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా ఆడియో కూడా యూత్ మనసులు కొల్లగొట్టేస్తుందని అంటున్నారు.  అంతేగాదు అక్కినేని ఫ్యామిలీకి మనం మూవీతో మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించిన విక్రమ్..ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో అఖిల్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని నాగ్ భావిస్తున్నాడు.  మొత్తంగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానున్న అఖిల్ హలోతో హిట్ కొడతాడా లేదా తెలియాలంటే  వేచిచూడాల్సిందే.