అఖిల్‌ ‘హలో’ టీజర్..?

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రానికి ‘హలో!’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ నాయికగా పరిచయమవుతోంది.

Akhil's Hello Teaser Teaser Released Date

నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజున సర్ ప్రైజ్ చేస్తానని నిన్ననే అఖిల్ చెప్పాడు.

దాంతో ఈ రోజున టీజర్ రిలీజ్‌ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ టీజర్ రిలీజ్ డేట్ మాత్రమే చెప్పాడు. ఈ నెల 16వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన అఖిల్, ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయనీ, ఈ సినిమా తనకి భారీ సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. మరి అఖిల్‌కి ఈ సినిమా అయినా విజయం అందిస్తుందో చూడాలి.