వారిని మోసం చేయలేను: ఆలియాభట్‌

Alia Bhatt spoke at length about her success and love for acting

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ప్రస్తుతం ‘రాజి చిత్రంలో నటిస్తోంది. విక్కీ కౌశల్ తో కలిసి ఆలియా నటిస్తున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ డైరెక్టర్. ఈ సందర్బంగా తన సినిమాలు ఇతర నటులతో ఉన్న పోటి గురించి ఆలియా ఓ ఇంటర్వూలో ఇలా మాట్లాడింది. ‘ఆ నటికి ఆ అవకాశం దక్కింది’, ‘నాకు దక్కలేదు’. అని భాధపడే టైప్‌ కాదు నేను. ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నాది రేపు మరొకరిది. ఎప్పుడూ విజయమే సాధించిలని అనుకోను. వాటి కోసమే సినిమాలు చేయడం లేదు నేను’ అంటు పేర్కొంది.

Alia Bhatt spoke at length about her success and love for acting

అంతే కాదు నాకు నాలుగేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంది. ఆ కోరికను నెరవెర్చుకోవడం కోసం సినిమాలు చేస్తున్నాను. అందులోనూ మంచి సినిమాలే ఎంచుకుంటాను. కంటెంట్‌ లేని సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మోసం చేయలేను. అలా అలోచిస్తాను కాబట్టే నా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. అని ఈ బాలీవుడ్‌ భామ చెప్పుకొచ్చింది.