బన్నీ న్యూలుక్ అదుర్స్

Allu Arjun New Look

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ జవాన్‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం బన్నీ తన లుక్‌ని మార్చాడు. ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్‌ స్టైల్‌తో ఆకట్టుకునే అర్జున్ ఈ సినిమా కోసం మరో స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. ‘ నా ఇల్లు ఇండియా’ అనేది ట్యాగ్ లైన్.

ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి.. కొన్ని నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన చిన్న లీక్ కూడా బయటకు రాలేదు. రిలీజ్ కి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. అప్పుడే ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్టే చేయడం కూడా సాధ్యం కాదు. అయితే.. ఇప్పుడు నాగచైతన్య-సమంతల రిసెప్షన్ కారణంగా.. తన తర్వాత చిత్రంలో అల్లు అర్జున్ లుక్ ఏంటో జనాలకు తెలిసిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా చెబుతున్నారు.విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.