విక్రం కుమార్‌తో బన్నీ భారీ బడ్జెట్ మూవీ..!

bunny allu arjun

ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు విక్రమ్ కుమార్‌. ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. అక్కినేని మూడు త‌రాల హీరోల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చిన మ‌నం సినిమా అయితే ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. అఖిల్‌తో ‘హలో’ సినిమా చేసి మెప్పించిన విక్రమ్ కుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి పారిస్ వెకేషన్లో ఉన్నారు. సాధారణంగా అగ్ర హీరోలంతా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు సైన్ చేయడం లాంటివి చేస్తారు. కానీ బన్నీ ‘నా పేరు సూర్య’ తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. పలువురు దర్శకులు కథ చెప్పినా ఓకే చెప్పలేదట.

అయితే విక్రము కుమార్ చెప్పిన కథకు బన్నీ ఓకే చెప్పాడని టీ టౌన్‌ వర్గాల టాక్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని టాక్. అయితే ఈ ప్రాజెక్టుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్టైలిష్ స్టార్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది.