అర్జున్ వర్సెస్ అర్జున్…

Allu arjun vs arjun

వరుస హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్న బన్నీ…తన తర్వాతి చిత్రంపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుతోంది. 2018 ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా యాక్షన్‌ కింగ్ అర్జున్‌ నటిస్తుండగా ప్రస్తుతం వీరిద్దరిపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అర్జున్‌ పాత్ర కథలో కీలకమని, ఆయన పాత్రలో ప్రతినాయకుడి లక్షణాలు కనిపిస్తాయని తెలుస్తోంది.

డైరెక్షన్ మీద కసితో వున్న వక్కంతం వంశీ ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని తనదైన స్టైల్లో ప్రజెంట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడట. తమిళ హీరో శరత్ కుమార్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.అల్లు అర్జున్ సరసన అను ఇమాన్యుయేల్ జంటగా నటిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ ద్వయం విశాల్ – శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.