బన్నీ దసరాకే వస్తున్నాడు…!

Allu Arjun's Naa Peru Surya firstlook on dasara

వరుస హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్న బన్నీ…తన తర్వాతి చిత్రంపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుతోంది. 2018 ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా ఫస్టులుక్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పవర్‌ఫుల్‌ మిలటరీ అధికారిగా కనిపించబోతున్న అల్లు అర్జున్.. అందుకోసం అమెరికన్ ట్రైనర్‌ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తున్నారు.  అల్లు అర్జున్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూర్చనున్నారు. దర్శకుడిగా ఇది తనకి తొలి చిత్రం కావడంతో, తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వక్కంతం వంశీ ఉన్నాడట.