సుధీర్‌,రష్మి పెళ్ళి నిజమే..? రష్మి క్లారిటి ఇచ్చేసింది.

Anchor Rashmi Responds On Her Marriage With Sudheer

ప్రముఖ యాంకర్‌ రష్మి గౌతమ్‌, కమెడియన్‌ సుధీర్‌ పెళ్ళి చేసుకున్నట్టుగా ఉగాది సందర్భంగా ఓ షాలో చూపించిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్ళి చేసుకున్నట్టు ప్రేక్షకులు నమ్మేశారు. కానీ అది నిజం కాదు.

ఇప్పటికీ వారికి పెళ్ళైందా..? లేక ఫేకా ? అనే డౌట్స్‌ నెటిజన్స్‌లో ఇంకా ఉన్నాయి. ఇక లేటెందుకు అనుకున్నాడో ఏమోగానీ..ఓ నెటిజన్ ట్వట్టర్‌లో రెష్మిని నేరుగానే అడిగేశాడు. ‘నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా.. లేదా? మాకు క్లారిటీ కావాలి’ అని రష్మికి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇక ఆట్వీట్‌కి తోడు మిగతా నెటిజన్స్‌ కూడా రష్మీపై ప్రశ్నల వర్షం కురిపించేశారు. ఒకరేమో ‘మాకు నిజమే అనిపిస్తోంది మేడమ్. మీరు సుధీర్‌తో లవ్‌లో ఉన్నారనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. ‘చూశాకే క్లారిటీ రావట్లేదు నిజంగా చేసుకుని అలా కవర్ చేశారేమో’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘సుధీర్‌కి వచ్చిన కల నిజం అయితే బాగుంటుందని మేము దేవుడిని వేడుకుంటున్నాం’ అని ఇంకొకరు ఇలా కామెంట్లతో రెచ్చిపోయారు.

ఇక మొత్తానికి క్లారిటీ కావాలంటూ.. ట్వీట్‌ చేసిన నెటిజన్‌ కి సమాధానంగా ‘షో చివరి వరకూ చూడండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది’ అని రిప్లై ఇచ్చింది రష్మి.