అందుకే ఒప్పుకోలేదట..

Anchor Srimukhi Revealed The Reason Behind Not Participating In bigboss

తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఈ షో అర్ధ శతదినోత్సవం జరుపుకుని విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘బిగ్ బాస్’లో పాల్గొనేందుకు టాప్‌ యాంకర్‌ శ్రీముఖి ఛాన్స్‌ కొట్టేసినా.. బిగ్ బాస్ హౌజ్‌లోకి మాత్రం ఎంటర్‌ అవలేకపోయింది. దానికి కారణం కూడా లేకపోలేదంటూ చెప్పుకొస్తోంది శ్రీముఖి.

Anchor Srimukhi Revealed The Reason Behind Not Participating In bigboss

తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని, తాను సరిగ్గా ఓ షోకు ఒప్పుకున్న మరుసటి రోజే ‘బిగ్ బాస్’లో పాల్గొనాలన్న ఆహ్వానం వచ్చిందని, అందువల్లే హౌస్ లో కాలు పెట్టలేదని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లో తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న శ్రీముఖి, కామెడీ షోలతో తాను చాలా బిజీగా ఉన్నందునే ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయానని చెప్పింది.

హిందీలో ఇదే షోను తాను పదే పదే చూశానని కూడా అంది. ఇక తొలుత పెద్ద స్టార్స్ నే రంగంలోకి దింపాలని బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు భావించినా, కొందరు షూటింగ్స్ తో బిజీగా ఉండి, మరికొందరు అన్ని రోజులు ఉండటం ఇష్టంలేక ‘నో’ చెప్పారని టాక్‌.