‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ మూవీ నుంచి అనూ అవుట్..

Anu Emmanuel walks out of Ravi Teja’s Amar Akbar Anthony

అనూ ఇమ్మాన్యుయేల్‌..టాలీవుడ్‌లో ఈ అమ్మడు అత్యవసర హిట్ కోసం ఎదురుచూస్తోంది. సరైన హిట్‌లు లేక సతమతమవుతూ వస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి అన్ని గ్లామర్ పాత్రలే చేసినప్పటికీ ఈ బ్యూటీకి ఎందుకో ఒక హిట్ కూడా దరిచేరడం లేదు. గతంలో పవన్ కల్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించింది.

 Anu Emmanuel walks out of Ravi Teja’s Amar Akbar Anthony

ఈ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళుతుందని ఊహించినా ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో డీలా పడింది. ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ సరసన ‘నా పేరు సూర్య’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో అనూకు మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఈ సినిమా కూడా కాస్త ఆటూ ఇటూగా ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంది.

ఇక రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించారు ఈ చిత్ర నిర్మాతలు. అవును నిజంగానే అనూ ఈ సినిమాలో ఆమె డేట్స్ అడ్జస్ట్‌ కాలేక మా సినిమాలో నటించట్లేదని తెలిపారు. దీనిపై స్పందించిన అనూ ఇమ్మాన్యుయేల్ నేను వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి తప్సుకున్నానంటూ తెలిపింది.