You are here

అనుష్క ‘పారి’ ట్రైలర్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తాజా సినిమా ‘పారి’. ఈ సినిమా పూర్తిగా హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించారు. గత కొన్ని రోజులుగా వరుసగా టీజర్లతో బయటపెట్టిన అనుష్క ఇప్పుడు ట్రైలర్ తో సినిమాను చూడాల్సిందే అనేలా ఒక మెస్సేజ్ ఇచ్చేసింది. డెవిల్ ఎవ్వరిని వదిలిపెట్టదు అనేలా ట్రైలర్ భయాన్ని రేపుతోంది. గత టీజర్స్ లలో అనుష్క తన పాత్రను ఎక్కువగా చూపించింది. కొన్ని షాట్స్ లలో అసలు కాన్సెప్ట్ ఇది అనేలా చూపించారు.

Anushka Sharma Pari Trailer

ఇక ట్రైలర్ చూశాకా ఒక క్లారిటీ వచ్చింది. సినిమాలో హీరో పై దెయ్యం కన్ను పడినట్లు తెలుస్తోంది. అది చంపడానికి ప్రయత్నిస్తోంది.. బయటకి వచ్చేసింది అంటూ అనుష్క చెప్పడం కొంచెం రొటీన్ హర్రర్ సినిమాలనే అనిపించినా అమ్మడు తన నటనతో సినిమాను లాగేలా ఉందని అర్ధం చేసుకోవచ్చు నటన పరంగానే కాకుండా డెవిల్ ఎమోషన్ ఎలా ఉంటుందో ఊహలకు అందేలా సినిమాలో చూపిస్తారట. ఈ సినిమా వచ్చే నెల మార్చ్ 2న హోలీ పండగ సందర్బంగా విడుదల కానుంది. అనుష్క తనే సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రోసిట్ రాయ్ దర్శకత్వం వహించగా అనుపమ్ రాయ్ మ్యూజిక్ అందించాడు.

Related Articles