ప్రభాస్‎కి క్లాస్ పీకిన స్వీటీ…

Anushka Shety Warning To Prabhash

టాలీవుడ్‎లో ప్రభాస్, అనుష్క జంట చూడముచ్చటగా ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. మిర్చి, బాహుబలి వంటి చిత్రాలతో టాలీవుడ్‎లో ఫర్‎ఫెక్ట్ జంటగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. అయితే బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‎లో జరుగుతోంది. భారీ యాక్షన్‌ ఎంటర్‎టైనర్‎గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక్క ఫైట్ సీన్‎కి రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Anushka Shety Going To Prabhash Saho Set

మరోవైపు హాలీవుడ్ రేంజ్‎లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఉంటాయని, మరింత రియాల్టీ కోసం ప్రభాస్ కూడా డూప్ లేకుండా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్‎లో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్‎కి ఇప్పటికే రెండు సార్లు గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్వీటీ దుబాయ్‎లోని సాహో సెట్‎కి వెళ్లి ప్రభాస్‎కి గంటసేపు క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ సన్నివేశాలు చేయకూడదని, నీకేమైనా అయితే ఫ్యాన్స్ బాధపడతారని ప్రభాస్‎కి గట్టి వార్నింగ్ ఇచ్చిందట. దానికి ప్రభాస్ కూడా డూప్‎ను పెట్టుకుంటానని స్వీటీకి ప్రామిస్ కూడా చేశాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Anushka Shety Going To Prabhash Saho Set

అయితే బెస్ట్ ఫ్రెండ్ కోసం దుబాయ్ వెళ్లిన స్వీటీని సినీ జనాలు మెచ్చకుంటున్నారు. మిర్చి సినిమా టైమ్ లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలను ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఖండించారు. మేం ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.