ఏపీ ఎంసెట్‌లో సత్తాచాటిన తెలంగాణ విద్యార్థులు

AP EAMCET 2018 results released

ఏపీ ఎంసెట్ 2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. శ్రీకాకుళంకు చెందిన బోగి సూరజ్ కృష్ణ 95.27 శాతం మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించగా రంగారెడ్డి జిల్లాకు చెందిన గట్టు మైత్రేయ 94.93 శాతం మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు.

గోసుల వినాయక్‌ శ్రీవర్ధన్‌ – 94.20 శాతం (రంగారెడ్డి) 4వ ర్యాంకు,షేక్‌ వాజిద్‌ – 93.78 శాతం (రంగారెడ్డి) 5వ ర్యాంకు, బసవరాజు జిష్ణు – 93.51 శాతం (రంగారెడ్డి) 6వ ర్యాంకు, అయ్యప్ప వెంకట ఫణి వంశీనాథ్‌ – 92.86 శాతం (రంగారెడ్డి) 7వ ర్యాంకు, ముక్కు విష్ణు మనోజ్ఞ – 92.56 శాతం (రంగారెడ్డి) 10వ ర్యాంకు సాధించారు. టాప్‌ 10లో ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులు 5గురు చోటు సంపాదించడం విశేషం.

మెడిసిన్‌లో గందె ఆదర్శ్‌ – 92.12 శాతం (కరీంనగర్) 4వ ర్యాంకు, ముక్తేవి జయసూర్య – 91.95 శాతం (హైదరాబాద్) 6వ ర్యాంకులు సాధించారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్ ఫలితాల్లోనూ గట్టు మైత్రేయ,గోసుల వినాయక శ్రీ విర్థన్‌ సత్తాచాటారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో గట్టు మైత్రేయ 5వ ర్యాంకు, గోసుల వినాయక శ్రీవర్ధన్ 10వ ర్యాంకులు సాధించారు.

వీరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు కూడా ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకులను దక్కించుకున్నారు. ఏపీ ఎంసెట్ కోసం హైదరాబాద్‌లోనూ 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో.. పలువురు ఏపీ విద్యార్థులు ఇక్కడ నుంచే పరీక్షలు రాశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అర్హత సాధించినవారి శాతం తగ్గిందని మంత్రి గంటా తెలిపారు.