ప్రతినాయకుడి పాత్రలో అర్జున్ మరోసారి..

Arjun

యాక్షన్ కింగ్ అర్జున్ తాజాగా విలన్ పాత్రలు పోషిస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. విశాల్ నటించిన తాజా చిత్రం ‘ఇరుంబుతిరై’. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి విలన్‌ పాత్రలో మెరవబోతున్నాడు అర్జున్. విజయ్‌ ఆంటోని నటిస్తున్న ‘కొలైక్కారన్’ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడన్న వార్త కోలీవుడ్ వర్గాల్లో కోడై కూస్తోంది.

Arjun

ఈ చిత్రానికి ఆండ్రూ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అర్జున్‌కు ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చినప్పటికి వాటిని తిరస్కరిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌తో పాటు అటు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారాడు అర్జున్. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ సినిమాలో కూడా మెరిసాడు.

ఇందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. విజయ్ అంటోని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కాళి’. ఇటీవలె విడుదలైన ఈ సినిమా  మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ‘ఇరుంబుతిరై’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అలరించిన అర్జున్ ఈ సినిమాతో ఏ రేంజులో ఆకట్టుకుంటాడో చూడాలి.