ట్రెండింగ్‌లో అర్జున్ రెడ్డి

Arjun Reddy Movie Theatrical Trailer

‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తర్వాత బిజీ ఆర్టిస్ట్‌గా మారిన విజయ్‌ నటించిన తాజా చిత్రం అర్జున్ రెడ్డి.  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెడికోగా నటిస్తున్న విజయ్‌కు జోడీగా శాలిని నటిస్తుంది. ఫస్ట్‌ లుక్‌ దగ్గరి నుంచి టీజర్ వరకు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేశాడు విజయ్. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులను కట్టిపడేశాడు. హార్డ్ హిట్టింగ్ స్టోరీ లైన్ తో, బలమైన ఎమోషన్స్ తో, ప్రస్తుత ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టు సినిమా ఉంటుందని స్పష్టంగా చెబుతున్న ఈ ట్రైలర్ భిన్నత్వాన్ని కోరుకునే ఆడియన్సుని ముఖ్యంగా యువతకి చాలా దగ్గరైపోయింది. నలుగురు సినిమా ప్రియులు ఒక చోట చేరితే ఈ ట్రైలర్ సంగతులే వినిపిస్తున్నాయి. అంతలా జనాల్లోకి వెళ్ళిపోయిందీ ట్రైలర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది.

విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.