You are here
అర్జున్‌ రెడ్డికి పోటి లేదు.. టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

అర్జున్‌ రెడ్డికి పోటి లేదు..

అక్కినేని నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ ఆగస్టు 25కు అనుకున్నా..ఆ తేదీ నుంచి వాయిదా పడిపోయింది. ఈ చిత్రాన్ని రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబరు 8న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆగస్టు చివరి వారంలో ‘అర్జున్ రెడ్డి’ తప్ప వేరే సినిమా ఏదీ లేదు. ఆ సినిమాకు క్రేజ్ ఉన్నప్పటికీ దాన్ని మరీ పెద్ద పోటీగా ఏమీ భావించాల్సిన పని లేదు. చైతూ సినిమా వస్తే అదే ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ అవుతుంది.

అయితే నాగచైతన్య మూవీ వాయిదా పడడంతో ‘అర్జున్ రెడ్డి’కి పోటీ లేకుండా పోయింది. సోలోగా ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సోలోగా వస్తుండం ‘అర్జున్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశమనీ .. ఈ సినిమా ఆయనకి సక్సెస్ ను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

Arjun Reddy Release Date Locked

పెళ్ళిచూపులు చిత్రం సన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ రెడ్డి`. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతుంది. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా`అర్జున్ రెడ్డి` సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్ ద్వారా విజ‌య్‌లోని కొత్త కోణాన్ని ద‌ర్శ‌కుడు సందీప్ వంగ ఆవిష్క‌రించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

Related Articles