You are here
‘బిచ్చగాడి’గా విజయ్ దేవరకొండ.. టాప్ స్టోరీస్ తాజా వార్తలు సినిమా 

‘బిచ్చగాడి’గా విజయ్ దేవరకొండ..

టాలీవుడ్‌లో రెండు మూడు వారాలుగా ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ గురించే చర్చ జరుగుతుంది.మరి విజయ్‌ ఇంతకుముందే రెండు మూడు సినిమాలు చేసినా.. వాటితో మంచి పేరే సంపాదించినా.. ‘అర్జున్ రెడ్డి’తో అతను సంపాదించిన పేరు అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. యువతలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుని చిన్న స్థాయి స్టార్ అయిపోయాడు విజయ్. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తనకి వచ్చిన క్రేజ్ ను ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ అమాంతంగా పెంచేసుకున్నాడు.

Arjun Reddy To Debut With Bichhagadu?

ప్రస్తుతం అయన చేతిలో అరడజను తెలుగు సినిమాలు వున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే ఆయనకి రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కన్నడలో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో చేసిన ‘పిచ్చాయ్ క్కారన్’ .. తెలుగులో ‘బిచ్చగాడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలనుకున్న ఓ నిర్మాత, విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం. ఈ రీమేక్ చేయడానికి విజయ్ దేవరకొండ అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు.

pichaikaran-movie-image-066

అయితే విజయ్‌ది సరైన ఆలోచనేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తమిళనాటో.. కేరళలోనో ఫాలోయింగ్ పెంచుకుంటే.. అక్కడి ప్రేక్షకుల్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించవచ్చు. ప్రతి సినిమానూ అనువాదం చేసుకోవచ్చు. అదనంగా ఆర్జించవచ్చు. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు. అక్కడ డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉంది. అలాంటపుడు విజయ్ ఏం సాధిస్తాడన్నది సందేహం. పైగా తెలుగులో ఇన్ని కమిట్మెంట్లుండగా.. కన్నడలో ట్రై చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి విజయ్ ఆలోచన ఎలా ఉందో? ఈ సినిమా పట్టాలెక్కుతుందో..? లేదో..? వేచిచూడాలి మరి..!

Related Articles