‘ఆటగాళ్లు’గా నారా రోహిత్, జగపతిబాబు..

Atagallu movie first look..

నారా రోహిత్, జగపతిబాబు నటిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తుండగా వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు చిత్ర యూనిట్.

Atagallu movie first look..

ఇందులో నారా రోహిత్, జగపతి బాబు నటిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ..నేను ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ఈ చిత్రం నాకు ప్రత్యేకమైన సినిమా అని, ఈ సినిమా ఓ సరికొత్త ఫందాలో ఉంటుందన్నారు. ‘ఆటగాళ్లు’ ఫుల్ ఎంటర్‌టైనింగ్ చిత్రంగా ఉండబోతోందని అన్నారు.

ఆనంతరం జగపతి బాబు మాట్లాడుతూ నాకు మురళి కథ వినిపించనపుడు నేను ప్రస్తుతం నేను విలన్‌ పాత్ర చేస్తున్నాను కాబట్టి విలన్‌ పాత్రలు అయితే ప్రేక్షకులు ఆదరిస్తారని, హీరోగా చేస్తే ఎవరూ చూడరని చెప్పాను. అయినా నాతో ఒప్పించి మరీ సినిమా రూపొందించారు. ఈ సినిమా దర్శకుడు మురళి మాట్లాడుతూ నేను జగపతిబాబును ఒప్పించి మరీ ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ ఇద్దరి హీరోలతో ఎక్కడా వెనక్కితగ్గకుండా తెరకక్కించామన్నారు. ఈ చిత్రం నిర్మాతలు నాకు స్నేహితులు కాబట్టి ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కించగలిగామని తెలిపారు.