అ…అవసరాల ఫస్ట్ లుక్‌

Avasarala Srinivas A...firstlook

క్లాస్ కమిడియన్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడుగా మారి, ఇప్పుడు హీరోగా రాణిస్తు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్.ప్రస్తుతం నాని నిర్మాతగా వాల్ పోస్టర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై అ..! సినిమా తెరకెక్కుతోంది. నిత్యామీన‌న్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శిని లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌డం విశేషం.

ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించి నిత్యా మీనన్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిందీ చిత్ర యూనిట్. దీనికి మంచి స్పందన వ‌చ్చింది. కాగా, బుధ‌వారం అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసారు. ఈ లుక్ చూస్తే.. శ్రీనివాస్ ఒక సైంటిస్టుగా కనిపిస్తున్నారు.

2008లో వచ్చిన ‘అష్టాచమ్మా’ సినిమాలో మొదటిసారి క‌లిసి న‌టించారు నాని, శ్రీనివాస్. ఇంతవరకు నాలుగు సినిమాల్లో ఈ ద్వయం కలిసి నటించారు. గతంలో ఈ ఇద్దరు నటులు.. అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసినవారు కావడం గమనార్హం. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.  ఓవర్సీస్‌లో ఈ మూవీని నిర్వాణ సినిమాస్ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.