ఆ నిర్మాతలే తొక్కేస్తున్నారు : అవికా

చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్, ఆ త‌ర్వాత తెలుగు లో ఉయ్యాలా జంపాల చిత్రం తో వెండితెర‌కు పరిచయమయ్యింది. మొదటి చిత్రం తోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్ హీరోయిన్ అనిపించుకుంది.. సినిమా చూపిస్త మావా తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతుంటే ఏదో ఒక విధంగా హీరోయిన్స్ ఇబ్బందులు పడకతప్పదని అంటారు.

అయితే ఇదే తరహాలో అవికా గోర్ కూడా ఇబ్బందులు పడుతుందట. చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నార్త్ -సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా గోర్ తనకు కొందరు నిర్మాతలు ఛాన్సులు రానివ్వకుండా తొక్కేస్తున్నారని చెప్పింది. ఉయ్యాల జంపాల – సినిమా చుపిస్తా మావ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి పరవాలేదు ఆనిపించింది. కానీ పెద్ద సినిమాల్లో ఆఫర్లు అంతగా రాలేదు.

Avika Gor Is Not Getting Movie Offers For This Reason

అయితే అలా రాకపోవడానికి ఏ కారణం కాదట కేవలం కొందరు బడా నిర్మాతలు తనను ఏ సినిమాల్లో తీసుకోవద్దని చాలా మంది నిర్మాతలకు చెప్పారట. దీంతో అమ్మడు తెగ బాధపడుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నటన పరంగా అవికాకి చిన్నప్పటి నుండే చాలా అనుభవం ఉంది. అయినా మొన్ననే 20లోకి అడుగుపెట్టింది. పైగా 20 కేజీలు వెయిట్ కూడా తగ్గింది. ఏ మాత్రం గ్లామర్ జోలికి వెళ్లకుండా ప్రతి చిత్రంలో ఇప్పటివరకు హోమ్లీగా కనిపిస్తూ వచ్చింది. మరి అమ్మడికి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఎవరికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు గాని మొత్తానికి ఆఫర్లు రానివ్వకుండా చేశారని చెప్పుకొచ్చింది.