192 దేశాల్లో బాహుబలి !

Baahubali to reach 192 countries now
Baahubali to reach 192 countries now

ఏప్రిల్ 28న విడుద‌లైన బాహుబ‌లి ది కంక్లూజ‌న్ చిత్ర ప్ర‌భంజ‌నం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను సాగింది. ఈ చిత్రం ఇప్పుడు సౌత్ లో ఎన్నో భారీ బ‌డ్జెట్ చిత్రాలు రూపొందేందుకు ఒక స్పూర్తిగా నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు. మూవీ విడుద‌లై మూడు నెల‌లు కావొస్తున్నా బాహుబ‌లి మానియా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 1700 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రం త్వ‌ర‌లో చైనాలో కూడా విడుద‌ల కానుంది.

తాజాగా ఆన్‌లైన్ వీడియో ఆన్‌ డిమాండ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నెట్‌ఫ్లిక్స్ బాహుబ‌లి 1, 2 చిత్రాల ఆన్‌లైన్ ప్ర‌సార హ‌క్కుల‌ను చేజిక్కించుకుంది. రూ. 25.5 కోట్ల‌కు ఈ డీల్ కుదిరింది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా 192 దేశాల్లో బాహుబ‌లి చిత్రాల‌ను వీక్షించవచ్చు. అంతేకాకుండా త‌మ బ్రాండ్ త‌ర‌ఫున అత్యుత్త‌మ నిర్మాణ విలువ‌ల‌తో వెబ్ సిరీస్‌ల‌ను కూడా లాంచ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది నెట్‌ఫ్లిక్స్.

netflix

అమెరికాకు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌. భార‌త‌దేశంలో త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ల‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ప్రాంతీయ భాషా చిత్రాల‌పై కన్నేసింది. వీడియో స్ట్రీమింగ్‌ సేవలను మన దేశీయ వినియోగదార్లు ప్రారంభించిన తేదీ నుంచి మొదటి నెల రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు. ఆ తర్వాత నుంచి నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.