ఆగస్ట్‌లో బాల్యయ 102వ చిత్రం..

Balakrishna 102 Movie on August

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో నందమూరి అభిమానుల్ని మెప్పించిన బాలయ్య ఆ వెంటనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించేందుకు అంగీకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వేడి తగ్గక ముందే పూరీ ఈ ప్రాజెక్ట్ కి పైసా వసూల్ అని పేరు పెట్టేయడం అంతే వేగంగా షూటింగ్ ను దాదాపు చివరి దశకి తీసుకురావడం జరిగిపోయాయి. ప్రస్తుతం బాలయ్య పైసా వసూల్ కి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం.

Balakrishna 102 Movie on August

అయితే నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్ 3న ప్రారంభకానుంది. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌. మరి జోరు మీదున్న బాలయ్య ముందుగా పైసా వసూల్ ఆ తరువాత 102వ సినిమా ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో కిక్‌ ఇస్తాయే చూడాలి.