బ్యాచిలర్‌.. బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ 102వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మరి ఈ సినిమాలో బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నాడు? ఆయన పాత్ర ఎలా వుండబోతోంది? అనే విషయాలపై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

Balakrishna Character Revealed in 102 movie ?

ఈ సినిమాలో ఆయన ‘పెళ్లికాని ప్రసాద్’ తరహా పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 40 ఏళ్లు వచ్చేవరకూ పెళ్లి కాకుండా ఉండిపోతాడట. ఆ తరువాత నయనతారను ప్రేమించి భగ్న ప్రేమికుడిగా మారిపోతాడని అంటున్నారు. అందుకు గల కారణాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయట. సెకండాఫ్ లో మళ్లీ నయనతార ఆయన జీవితంలోకి ఎంటరవుతుందని చెబుతున్నారు. మరో కథానాయికగా నటాషా దోషి నటిస్తోన్న ఈ సినిమా, సంక్రాంతికి విడుదల కానుంది.