‘సన్’ బౌలర్స్ రాణిస్తారా..?

Bangalore will take on table-toppers Sunrisers Hyderabad

ఐపీఎల్‎-11లో ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్‎కి చేరాయి. అయితే మిగతా ఐదు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం పోరాడుతున్నాయి. లీగ్ ఆరంభంలో తడబడిన జట్లు చివరి దశకొచ్చేసరికి తమ జోరు పెంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటుంన్నాయి. బెంగళూరు, ముంబై జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ కోసం సన్ రైజర్స్‎తో పోటీ పడనుంది. లీగ్ ఆరంభం నుంచి బౌలింగ్ బలంగా ఉన్న జట్టు హైదరాబాద్. కానీ చెన్నైతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. ఇప్పటివరకు సన్ రైజర్స్ విజయాల్లో బౌలర్లే కీలకపాత్ర పోషించారు.

Bangalore will take on table-toppers Sunrisers Hyderabad

మరోవైపు బెంగళూరు జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా మెరుగ్గా రాణిస్తుంది. భారీ స్కోర్ నమోదు చేసినా… కోహ్లీ సేన అవలీలగా ఛేదిస్తోంది. సన్‎రైజర్స్ మాత్రం బ్యాటింగ్ పరంగా ప్రతిసారి విలియమన్స్, శిఖర్ ధావన్‎లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లద్దరు కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ కూడా మెరుగ్గా రాణిస్తే.. సన్ రైజర్స్ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బౌలర్లు తమ బౌలింగ్ తో బెంగళూరు బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తే.. సన్ రైజర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చు. ఇక నేడు సన్‎రైజర్స్‎తో జరిగే మ్యాచ్ లో బెంగళూరు నెగ్గితేనే… ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకుంటే ఈ సీజన్‎లో చాంపియన్‎గా నిలవాలనుకున్న కోహ్లీ ఆశలు ఆవిరైపోతాయి.