ఆ అలవాటుకు.. అరటిపండే పరిష్కారం..

మనకు సహజంగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఈ పండుని ఎక్కువగా ఎనర్జీ కోసం కూడా తింటారన్నవిషయం తెలిసిందే.

అయితే అరటిపండు సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తుల అలవాట్లను మానుకునేందుకు కూడా ఎంతో సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 bannana solutions for  tobacco effects

ఈ పండులో బి-6, బి-12 విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సహజంగానే ఉంటాయి. ఇవి సిగరెట్‌ మానుకున్నప్పుడు వచ్చే నికోటిన్‌ విత్‌డ్రాయల్‌ లక్షణాల నియంత్రణకు తోడ్పడతాయట.

అరటి పండులో గ్లూకోజ్‌ నిలువలు చాలా ఎక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటిని తినకూడదని చెప్పడం సహజం. అయితే అరటికాయలో చక్కెర, ఉప్పు నిలువలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు కూడా అరటికాయ కూర తినవచ్చు అంటున్నారు.

  bannana solutions for  tobacco effects

అరటి పండులో అత్యధిక శాతం పొటాషియం ఉంటుందని, అందుకే తిన్న వెంటనే శక్తి వస్తుందని, అందుకోసమే బాగా నీరసించిన వారికి సత్వరమే శక్తి రావాలంటే అరటిపండు తినాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా అరటి పండులోని పొటాషియం హానికరం కాదని, నీళ్లలో ఉండే పొటాషియం హృద్రోగులకు కొంత నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు. అరటి పండులోని పొటాషియంతో ఎలాంటి నష్టం ఉండదని కూడా ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సో…పొగాకు ఉత్పత్తుల అలవాట్లను మానుకోవాలనుకుంటే అరటిపండు కూడా చక్కని పరిష్కారమన్నమాట.