బతుకమ్మ చీరల పంపిణి నేటినుంచే..!

Bathukamma sarees distribution from Sept 18

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో వినూత్నమైన కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణి. రాష్ర్టంలోని ప్రతి పేద అడ బిడ్డకు బతుకమ్మ పండగ సంబరం నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ ఇంటి పండగ బతుకమ్మకు ప్రతి పేద అడబిడ్డ సంతోషంగా పండగ చేసుకోవడంతోపాటు, దశాబ్దాలుగా సరిపోయినంత ఉపాది లేకుండా ఉన్న నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపీణి చేపట్టింది.

సూమారు మూడు నెలల కింద నేతన్నలతో ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు గారు ప్రగతి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతన్న కష్టాలు, వారికి కావాల్సిన ప్రభుత్వం సహకారం పైన చర్చించారు. ఈ సందర్భంగా ప్రతి నేతన్నకు కనీసం 15 వేల నెల ఉపాది దొరికేలా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూలక్పల్పన చేస్తుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల భాద్యతను మంత్రి కెటి రామారావుకు అప్పగించారు. ఇప్పటికే రంజాన్, క్రిష్ర్టమస్ పండగలకు నూతన వస్ర్తాలు పంపీణీ చేస్తున్న ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరల పంపీనీ కార్యక్రమం ద్వారా నేతన్నలకున్న సంక్షోభాన్ని సంబరంగా మార్చేందుకు పని ప్రారంభించింది.

 Bathukamma sarees distribution from Sept 18

బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ జౌళి మరియు చేనేత శాఖ, మంత్రి కెటి రామారావు అధ్యర్యంలో ప్రణాళిక బద్దంగా పనిచేసింది. ముందుగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి అడబిడ్డకు చీరల పంపీణీ చేయాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు సూమారు కోటీ నాలుగు లక్షల చీరలు(1,04,57,610)ను సిద్దం చేసింది. ఇందుకోసం సూమారు 222 కోట్లు రూపాయల ఖర్చు చేయనుంది. ఈ చీరల తయారీకీ సూమారు ఏడు కోట్ల మీటర్ల వస్తాలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈ మెత్తం చీరల్లో సగానికిపైగా రాష్ర్టం నుంచే సేకరించింది. రాష్ర్టంలోని మరమగ్గాల్లో అత్యధిక శాతం ఉన్న సిరిసిల్లాలోనే 52 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. ఈ రెండు నెలలపాటు రాష్ర్టంలోని అన్ని మరమగ్గాలు పూర్తి ఉత్పాదక సామర్ద్యంతో పనిచేసిన సగం చీరలు సిద్దం అయ్యాయి. దీంతో జాతీయ స్థాయి టెండరింగ్ ప్రక్రియ ద్వారా మిగిలిన చీరలను సేకరించారు. వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఇక్కడి నేతన్నల నుంచే సేకరణ చేయనున్నారు.

ఈ చీరల తయారీలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ముఖ్యంగా టెక్స్టైల్ డైరెక్టర్ శ్రీ శైలజా రామయ్యర్ అద్వర్యంలో వందలాది చీరల డిజైన్లను తయారు చేయించారు. ఈ డిజైన్ల నుంచి ముఖ్యమంత్రి కార్యాయలంలో పనిచేస్తున్న మహిళా ఉన్నతాధికారులు, ఇతర అధికారిణులు పలు చీరలను ఎంపిక చేశారు. ఇలా మహిళాల అభిరుచి మేరకు ఈ బతుకమ్మ చీరల డిజైన్ ఎంపిక జరిగింది. పండగనాడు అందరు మహిళలు ఒకే విధంగా కన్పించకుండా సూమారుగా 500పైగా డిజైన్లు, పలు రకాల రంగుల్లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చీరల తయారీ తాలుకు వస్ర్తాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు,బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ద వహించారు. సూరత్ నుంచి వచ్చే చీరల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు శైలజా రామయ్యర్ స్వయంగా సూరత్ వెళ్లి వచ్చారు.

 Bathukamma sarees distribution from Sept 18

చీరల పంపిణీకి అంతా సిద్దం అయ్యిందని మంత్రి కెటి రామారావు తెలిపారు. బతుకమ్మ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి అదేశాల మేరకు కోటి నాలుగు లక్షల అడబిడ్డలకు, సొదరీమణులకు బతుకమ్మ కానుగా చీరలు అందివ్వడం తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిస్తుందన్నారు. చీరల పంపిణీ కోసం ప్రత్యేకంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో ఎన్నికల్లో మాదిరి ప్రత్యేకంగా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఈ మేరకు ప్రతి కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని, ఏలాంటి ఇబ్బంది లేకుండా చీరల పంపిణీ చేస్తామన్నారు. 18 సంత్సరాల వయసు నిండి, తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి సొదరికి ఈ చీర అందుతుందన్నారు. ఇప్పటికే జిల్లా గోడౌన్లకు 80 శాతం చీరలు చేరుకున్నాయని, 18, 19, 20 తేదీల్లో మెత్తం చీరల పంపిణి జరుగుతుందన్నారు.