ఎంసీఏ అర్ధం మార్చిన.. భూమిక

Bhumika comeback with Nani starrer 'MCA'

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న  తాజా చిత్రం ఎంసీఏ. నిన్నుకోరి లాంటి హిట్ తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది. ‘ఓ మై ఫ్రెండ్’ లాంటి యూత్‌ఫుల్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  నానికి జోడీగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది.

ఇటీవల విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది.మిడిల్ క్లాస్ అబ్బాయిల లైఫ్ స్టైల్ గురించి నాని చెప్పిన డైలాగ్స్ అలరించాయి. పెళ్లి చేసుకుందామంటూ సాయి పల్లవి నానితో చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. తాజాగా ఈ చిత్రంలో భూమిక చేరింది. ఎంఎస్‌ ధోని బయోపిక్‌లో ధోని అక్క పాత్ర పోషించిన భూమిక తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిందట. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

Bhumika comeback with Nani starrer 'MCA'
ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ట్రైలర్‌తో రెడీ అయ్యాడు నాని.  11న ట్రైలర్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.దేవీ శ్రీ ప్రసాద్  మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు సాంగ్స్‌ను ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు అదే రోజు ఆడియో వేడుకను నిర్వహించి మొత్తం సాంగ్స్‌ను విడుదల చేయనున్నారు.