కమల్ హాసన్‌‌ వల్లే ఆ బూతులు…

Bigg Boss Tamil: Kamal Haasan pulls up Gayathri Raghuram, Oviya is

ప్రేక్షకుల మధ్య భారీ ఆదరణకు నోచుకుంటున్న బిగ్ బాస్ షో ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ తమిళ కార్యక్రమంలో పాల్గొన్న పార్టిసిపెంట్ గాయత్రి హోస్ట్ కమల్ హాసన్‌‌పై తాను బూతులు మాట్లాడానని ప్రజల్ని కమల్ హాసనే రెచ్చగొడుతున్నారని కొరియోగ్రాఫర్ అయిన గాయత్రి వెల్లడించింది. హోస్ట్ కమల్ హాసన్‌‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది.

 Bigg Boss Tamil: Kamal Haasan pulls up Gayathri Raghuram, Oviya is

అయితే బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి సహ పార్టిసిపెంట్స్‌ను బూతులు తిడుతున్నట్లు గాయత్రిపై ఆరోపణలున్నాయి. ఓవియాపై గాయత్రి చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. గాయత్రి టార్చర్‌కు తట్టుకోలేక బిగ్ బాస్ హౌస్ నుంచి ఓవియా పారిపోయింది.

పలుమార్లు ఓవియాను టార్గెట్ చేసిన గాయత్రి.. ఆమెను బూతులు తిట్టింది. పలుసార్లు బెదిరించింది. అంతేకాకుండా ఓవియాను హెయిర్ అనే బూతుపదంతోనూ తిట్టింది. ఇవన్నీ ప్రేక్షకులకు గాయత్రిపై కోపాన్ని తెప్పించాయి. అంతేకాకుండా గాయత్రి యవ్వారంపై కమల్ హాసన్ ఏమాత్రం స్పందించట్లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Bigg Boss Tamil: Kamal Haasan pulls up Gayathri Raghuram, Oviya is

ఇదిలా ఉండగా..కమల్ హాసన్ గత వారం ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌ను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పలకరించారు. ఈ క్రమంలో గాయత్రి వద్ద విచారించిన కమల్.. బూతులు వాడటం ఏమిటని ఖండించారు.

అయితే తాజా ఎపిసోడ్‌లో కమల్ హాసన్‌పై గాయత్రి ఆరోపణలు చేసింది. తాను బూతుపదాలు మాట్లాడుతున్నట్లు కమల్ హాసన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని,ఇంకా తనను మార్చే హక్కు కమల్ హాసన్‌కు లేదని గాయత్రి చెప్పింది. కమల్ హాసన్ అనవసరం తనకు కోపం తెప్పిస్తున్నారని గాయత్రి వెల్లడించింది.