బిగ్‌బాస్‌ 2 : సెలబ్రిటీలు వర్సెస్ కామన్‌ మేన్‌

biggboss 2

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్‌ సీజన్‌ 2 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో తొలిరోజే కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సెలబ్రిటీలనే కాదు సామాన్య ప్రజలను కూడా ఈ సారి బిగ్‌ హౌస్‌లోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన నూతన్ నాయుడు, గణేష్‌లతో పాటు మోడల్‌ సంజన బిగ్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

అయితే, కామన్‌మేన్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 16 మంది కంటెస్టెంట్‌లో ఇద్దర్ని బయటకు పంపేందుకు ఎన్నుకోవాలని ఆదేశించడంతో 15,16 కంటెస్టెంట్‌లుగా వచ్చిన సంజనా,నూతన్ నాయుడు పేర్లను సూచించారు. దీంతో వీరిని హౌస్ బయట ఉన్న జైల్లో పెట్టి తాళం వేశారు. రెండో ఎపిసోడ్‌లో ఈ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

మోడలింగ్‌లో రాణిస్తూ మిస్ హైదరాబాద్‌గా ఎంపికైన సంజనా బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ టచ్ ఇచ్చింది సంజనా. సామాన్యుడుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాని స్టార్‌గా ఎలా ఎదిగారో తాను కూడా సామాన్యురాలుగానే బిగ్ బాస్ టైటిల్‌ను గెలుస్తా అంటూ ధీమా వ్యక్తం చేసింది సంజనా. మరి సంజనా ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Related image

100 రోజుల పాటు సాగే ఈ షోకు ఎంపికైన వారిలో గీతా మాధురి (సింగర్), అమిత్ తివారీ (నటుడు), దీప్తి నల్లమోతు (టీవీ 9 యాంకర్), తనీష్ (హీరో), బాబు గోగినేని(హేతువాది), భాను శ్రీ, రోల్ రైడా (ర్యాప్ సింగర్), యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునైనా (యూ బ్యూబ్ నటి),కౌశల్ (ఆర్టిస్ట్), తేజస్వి మదివాడ,సామ్రాట్ , గణేష్ (సామాన్యుడు), సంజనా అన్నే (సామాన్యురాలు) , నూతన్ నాయుడు.