తుది దశకు బిగ్ బాస్ మొదటి సీజన్

-bigg-boss-telugu

బిగ్‌ బాస్‌ షో… తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం.. ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా నిర్వహిస్తున్న ఈ షో విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది. గత 58 రోజులుగా దిగ్విజయంగా ప్రసారవమవుతూ వస్తున్న ఈ షో మరికొద్ది రోజుల్లో మొదటి సీజన్‌ను ముగించుకోబోతోంది. సెలెబ్రిటీల గొడవలు, టాస్క్‌లు, ఎలిమినేషన్‌లు, ఏడ్పులు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, హాట్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకున్న ఈ షో ముగింపు అంకం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో బిగ్‌ బాస్‌ మొదటి విజేత ఎవరనే విషయం తేలనుంది. అయితే ఇటీవల ప్రసారమైన బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లో ఓ ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. ఈ షో ప్రారంభమైన దగ్గరి నుంచి సరదాగా సాగుతున్న ఈ షోలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.

-bigg-boss-telugu

ఈ షోలో పార్టిసిపెంట్లుగా కొనసాగుతున్న సెలెబ్రిటీల కుటుంబ సభ్యులు షోలోకి వచ్చి సందడి చేశారు. గత కొంత కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న బిగ్‌ బాస్‌ హౌజ్‌ సభ్యులు తమ కుటుంబ సభ్యులను చూసేసరికి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. మొదటగా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి మొదటగా శివబాలాజీ భార్య హౌస్ లో అడుగు పెట్టారు. అప్పటికే ఆటలో భాగంగా ఫ్రీజ్ లో ఉన్నారు అతను. ఈ లోపే తన భార్యను అక్కడ చూడటంతో కాస్తంత ఉద్వేగానికి గురయ్యారు. ఆమెను హత్తుకుని వదల్లేదు. ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఆమె చాలా సరదాగా అందరితో మాట్లాడి వెళ్లారు.

-bigg-boss-telugu

ఈ లోపే తమ కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చి అర్చన, దీక్ష, ఆదర్శ్ లు కన్నీరు కార్చారు. మరికొద్ది సేపటికే ఆదర్శ్ సతీమణి గుల్నార్‌ అక్కడకు వచ్చారు. అది చూసి ఆదర్శ్ తట్టుకోలేక పోయారు. కానీ నిమిషం లోపే గుల్నార్‌ను బిగ్ బాస్ బయటకు పిలవడంతో ఆదర్శ్ ఆగలేకపోయారు. చేతిలో వారి పిల్లోడు ఫోటోలతో పాటు.. చిన్న మెసేజ్ రాసి ఆదర్శ్‌ చేతిలో పెట్టి గుల్నార్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటికి వచ్చింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆదర్శ్‌కు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. దీంతో ఏకధాటిగా ఏడుస్తున్న ఆదర్శ్‌ను కూల్ చేయడానికి బిగ్ బాస్‌ మరోసారి ఆయన భార్య చిన్నోడుతో ఎంట్రీకి అవకాశం ఇచ్చి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు బిగ్ బాస్. మొత్తానికి ఉత్సాహంగా సాగుతున్న బిగ్‌ బాస్‌ షోలో ఈ ఎపిసోడ్‌ కాస్త ఉద్వేగాన్ని నింపింది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో మిగిలింది నవదీప్‌, శివబాలాజీ, అర్చన, హరితేజా, ఆదర్శ్‌, దీక్షాలు. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు.