ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బొమన్ ఇరానీ..!

boman irani

దివంగత లెజండరీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య 64 అవతారాల్లో కనిపించనుండగా కొత్తవారికి సైతం అవకాశం కల్పించారు. అయితే కొత్తవారితో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా రంగంలోకి ఎంట్రీ,పొలిటికల్ కెరీర్ వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాదెండ్ల భాస్కరరావు పాత్రను బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పోషించనున్నట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించున్నాడు.

Related image

బాలయ్య బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ బయో పిక్ ఫస్ట్ లుక్‌ను విడదుల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలతోబాటు అవే రోల్స్ లో బాలకృష్ణను చూపారు. నాన్న పాత్రనే పోషిస్తూ పితృ రుణాన్ని బాలయ్య తీర్చుకుంటున్నారనే కామెంట్లు వినవస్తున్నాయి.

వారాహి చలన చిత్రం, యన్‌బికె ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తుండగా బిఎస్.జ్ఞానశేఖర్, తోట తరణి, సాయి మాధవ్ బుర్ర, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదితరులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.