‘భద్ర’ తర్వాత నేను తీసిన ప్రేమకథ..

Boyapati Says About Jaya Janaki Nayaka Movie

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. బోయపాటి శ్రీను దర్శకుడు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోయపాటి మాట్లాడారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.‘‘భద్ర’ తర్వాత నేను తీసిన ప్రేమకథ ‘జయ జానకి నాయక’. 2007లోనే ఈ కథను రాసుకున్నా. ఎప్పటికప్పుడు ఈ సినిమా తీయాలి అనుకుంటూనే ఉన్నాను. కానీ కుదరలేదు. సరైన సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ కలవడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ.‘ఎప్పుడూ ఒకేరకమైన సినిమాలు చేయడం ఎందుకనే.. ఇప్పుడు ప్రేమకథను ఎంచుకున్నా. అన్నారు బోయపాటి.

Boyapati Says About Jaya Janaki Nayaka Movie

‘‘జయ జానకి నాయక సినిమాకు బడ్జెట్ కూడ ఎక్కువ పెట్టిన మాట వాస్తవమే. ఐతే నేను చిన్న హీరోతో చేస్తున్న మాత్రాన తగ్గి సినిమా చేసే రకం కాదు. ఎవరితో సినిమా చేసినా అది నా స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే నా సినిమా అంటే ఒక అంచనాలు పెట్టుకునే ప్రేక్షకులున్నారు. అలాగే నా సినిమాకు కొబ్బరికాయ కొట్టానంటే చాలు.. మంచి రేట్లకు సినిమాను కొనేసే బయ్యర్లు ఉన్నారు.

Boyapati Says About Jaya Janaki Nayaka Movie

‘జయ జానకి నాయక’ విషయంలోనూ అదే జరిగింది. వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తా. ‘జయ జానకి నాయక’కు బడ్జెట్ ఎక్కువైనా సరే.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరిగింది. నా మీద బయ్యర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. నా నిర్మాత.. నా బయ్యర్లు బాగుంటేనే నేను బాగుంటాను. వాళ్లకు అన్యాయం జరిగితే నేను సినిమాలే చేయను. నేను నా ప్రతి సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుని.. ఎక్కువ రోజులు వర్క్ చేసేది వాళ్లను దృష్టిలో పెట్టుకునే’’ అని బోయపాటి అన్నాడు. అంతేకాదు ఈ సినిమా తర్వత చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, అఖిల్‌ల కోసం కథలు సిద్ధం చేసినట్టు కూడా బోయపాటి తెలిపారు. వచ్చే ఏడాది జులైకి బాలకృష్ణతో సినిమా ప్రారంభం చేయబోతున్నట్లు బోయపాటి చెప్పారు.