తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి- కేటీఆర్‌

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యుఎఇ ఎక్సైజ్‌ చైర్మెన్‌ బి.అర్. షెట్టి ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటి రామారావుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బి.అర్. షెట్టి సూచనప్రాయ అంగీకారం తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటి రామారావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీ, సింగిల్ విండో అనుమతులను మంత్రి, బి.అర్. షెట్టీకి వివరించారు.

BR Shetty Meets Minister KTR

హైదారాబాద్ నగరం బల్క్ డ్రగ్ రాజధానిగా ఉన్నదని, దీంతోపాటు లైప్ సైన్సెస్, ఏరోస్పెస్ రంగాల్లోనూ అధికంగా పెట్టబుడులు వస్తున్నాయని తెలిపారు. తాము ఫార్మాసీటీ, మెడ్ డైవైసెస్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామన్నారు. దీంతోపాటు నగరంలోని హెల్త్ కేర్ రంగంలోనూ తమకు ఆసక్తి ఉన్నదని బి.అర్ షెట్టీ తెలిపారు. తెలంగాణ గురించి తనకు చాల మంది ఇప్పటికే అనేక మంచి విషయాలు తెలిపారని, ఇప్పుడు మంత్రిని కలిసి రాష్ర్టా పారిశ్రామిక ప్రగతి స్వయంగా తెలుసుకున్నామన్నారు.

BR Shetty Meets Minister KTR

తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవసరం అయితే తాను స్వయంగా సహాకరిస్తామన్నారు. ఈమేరకు దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఎర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో తమ సంస్ధ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గోన్నారు.