రూ.999కే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్‌ డేటా..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ… భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్రీపెయిడ్ వినియోగదారులకోసం రూ.999కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

రూ.999తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా లభిస్తుంది. జమ్మూ కశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని BSNL మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అలాగే 181 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి.

 BSNL Introduces Rs. 999 Pack, Offers 1GB Data Per Day for 1 Year

అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1GB వరకు మొబైల్ డేటా మాత్రమే ఫ్రీగా లభిస్తుంది. కానీ ఏడాదిపాటు మొబైల్ డేటాను పొందవచ్చు. అంటే మొత్తం ఏడాదికి కలిపి రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 365 GB డేటా ఈ ప్లాన్ ద్వారా వస్తుంది. ఇదే ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌లలో లభిస్తుండగా, వాటికి 60 GB డేటాను 90 రోజుల వాలిడిటీతో మాత్రమే అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా..జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం సంస్థలు వినియోగదారులను రకరకాల ఆఫర్లతో ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, ఐడియా సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.