‘మనం’ డైరెక్టర్‌తో బన్నీ..

Bunny In Vikram Direction

స్టైలిష్ స్టార్ అల్టు అర్జున్..ఎప్పుడు మాస్, యాక్షన్ సినిమాలతో పలకరించే ఆయన ఈసారి ఏకంగా ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా తర్వాత బన్నీ నటించిన చిత్రం ‘నా పేరు సూర్య’. మిలటరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు వక్కంతపు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Bunny In Vikram Direction

హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ నటించగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా మెగా బ్రదర్ నాగబాబు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో మళ్లీ ఇలాంటి ప్రయోగాలను చేయొద్దని ఆలోచనల్లో ఉన్నాడట బన్నీ. తనకు అచ్చొచ్చిన మాస్ సినిమాలతోనే అలరించాలనుకుంటున్నాడు. ఇక విషయానికొస్తే ఇష్క్, మనం, 24’’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

అయితే ఇప్పటికే విక్రమ్ కుమార్ అల్లు అర్జున్‌కు కథ వినిపించాడని, ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని తన తదుపరి సినిమా ఆయనతో చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ కుమార్‌తో ఎలాగైన హిట్ కొట్టాలనుకుంటున్నబన్నీమరి వీరి కాంబినేషన్‌లో ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.