మహేష్ కు పోటీగా తమన్నా..?

mahesh babu

మహేష్‌బాబు రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరో హీరోయిన్లుగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం స్పైడర్‌ ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్‌కు పోటిగా తమన్నా రాబోతున్నట్టు తెలుస్తోంది. తమన్నా ఏంటి.. స్పైడర్‌ ట్రైలర్‌కు పోటీగా రావడం ఏంటి అని అనుకుంటున్నారా..? అవునుండి మీరు విన్నది నిజమే… ఎన్టీఆర్‌ తాజాగా నటించిన చిత్రం జై లవకుశ.

Can Tamanna really compete with Mahesh's Spyder?

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో తమన్నా ఓ ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. ఈ సాంగ్ టీజర్‌ను స్పైడర్‌ మూవీ ట్రైలర్‌ రోజున విడుదల చేయాలని జైలవకుశ మూవీ టీం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లు తాజాగా నటించిన ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దసరాకు బరిలో నిలుస్తున్న ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులు ఏసినిమాను ఆదరిస్తారో చూడాలి.